ఓట్ల కోసం అబద్ధాలు: కాంగ్రెస్‌పై మండిపడ్డ విప్లవ్ దేవ్

ABN , First Publish Date - 2022-02-04T02:58:06+05:30 IST

అబద్ధాలతో మీరు ఎన్నికలకు వెళ్తారు. కానీ ప్రజలు అవినీతి పార్టీలకు ఓట్లు వేయరు. అలా అని ఎన్నికల సంఘాన్ని తప్పు పడ్తారా? అవాస్తవమైన మీ వాదనలను కోర్టులు తప్పు పడితే, న్యాయవ్యవస్థ తప్పా? దుమ్ము మీ ముఖంపై ఉంటే అద్దాన్ని ఎన్నిసార్లు తుడుస్తారు?

ఓట్ల కోసం అబద్ధాలు: కాంగ్రెస్‌పై మండిపడ్డ విప్లవ్ దేవ్

అగర్తలా: ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో ఎన్నికల సంఘంపై న్యాయవ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన పై విధంగా అన్నారు. ముఖంపై దుమ్ము ఉంటే అద్ధాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసి ఏం లాభం అంటూ రాహుల్ గాంధీ వీడియో షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్ పార్లమెంట్‌లో మాట్లాడిన వీడియో షేర్ చేసిన విప్లవ్ దేవ్ ‘‘అబద్ధాలతో మీరు ఎన్నికలకు వెళ్తారు. కానీ ప్రజలు అవినీతి పార్టీలకు ఓట్లు వేయరు. అలా అని ఎన్నికల సంఘాన్ని తప్పు పడ్తారా? అవాస్తవమైన మీ వాదనలను కోర్టులు తప్పు పడితే, న్యాయవ్యవస్థ తప్పా? దుమ్ము మీ ముఖంపై ఉంటే అద్దాన్ని ఎన్నిసార్లు తుడుస్తారు?’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2022-02-04T02:58:06+05:30 IST