PUNJAB సీఎం ఎంపిక బాధ్యత సోనియాకే..

ABN , First Publish Date - 2021-09-19T00:57:30+05:30 IST

కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ..

PUNJAB సీఎం ఎంపిక బాధ్యత సోనియాకే..

ఛండీగఢ్: కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే అప్పగిస్తూ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) శనివారంనాడు ఏకగ్రీవ తీర్మానం చేసింది. పంజాబ్‌లో జరిగిన సీఎల్‌పీ సమావేశానంతరం ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ రెండు తీర్మానాలను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిందని, ఈ రెండూ సీఎల్‌పీ సమావేశంలో ఆమోదం పొందాయని చెప్పారు.


''ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని కోరడం సంప్రదాయంగా వస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, కొత్త సీఎం ఎంపిక బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది'' అని రావత్ తెలిపారు. పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. రెండో తీర్మానం గురించి వివరిస్తూ, అమరీందర్‌ సింగ్‌ను ప్రశంసిస్తూ సీఎల్‌పీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని అన్నారు. సీఎల్‌పీ సమావేశంలో కాంగ్రెస్ పరిశీలకులుగా హాజరైన అజయ్ మాకెన్ మాట్లాడుతూ, సీఎల్‌పీ నేత గురించిన చర్చ ఏదీ సమావేశంలో జరగలేదని అన్నారు.

Updated Date - 2021-09-19T00:57:30+05:30 IST