Abn logo
Sep 17 2021 @ 23:23PM

గజ్వేల్‌ సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

మేడ్చల్‌ : గజ్వేల్‌ సభకు తరలివెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌/కీసర : కాంగ్రెస్‌ పార్టీ ఘట్‌కేసర్‌ మండలాధ్యక్షుడు కర్రె రాజేష్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన  దండోరా సభకు తరలివెళ్లే ముందు ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్‌ నగర్‌ నుంచి ఏదులాబాద్‌ చౌరస్తా వరకు డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి 50 కార్లు, ఒక బస్సు, డీసీఎంలలో సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పీసీసీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, మామిండ్ల ముత్యాలుయాదవ్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. మేడ్చల్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు పెద్దఎత్తున సభకు తరలివెళ్లారు. ఆ పార్టీ మండలాధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యాక్షుడు గోమారం బాల్‌రెడ్డి, కౌన్సిలర్‌ చేపరాజు తదితరులు జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వరదారెడ్డి, పోచయ్య, రేగు రాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పానుగంటి మహేష్‌, శ్రీశైలం, సర్పంచ్‌ సురేందర్‌ముదిరాజ్‌, వినోద్‌, రవిముదిరాజ్‌, కౌన్సిలర్‌ శ్రీనివా్‌సయాదవ్‌, నారెడ్డి కొండల్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్‌, తదితరులున్నారు. కీసర నుంచి కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు కోల కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు అధికసంఖ్యలో తరలివెళ్లారు.