కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం పర్యటన ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-08-18T07:39:13+05:30 IST

కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు సం దర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం  పర్యటన ఉద్రిక్తం

భట్టి నేతృత్వంలో ప్రాజెక్టు సందర్శనకు నేతలు

భూపాలపల్లిలో అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు

పోలీసుల తోపులాటలో భట్టికి స్వల్ప అస్వస్థత

ప్రాజెక్టు కట్టేటప్పుడు బస్సుల్లో తీసుకెళ్లారు

ఇప్పుడు అవినీతి బయటపడుతుందనే అడ్డుకున్నారు: భట్టి 

ప్రాజెక్టుల సందర్శనకు ఏర్పాట్లు చేయాలి

లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం: రేవంత్‌ రెడ్డి



భూపాలపల్లి, ఇల్లెందు, హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు సం దర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాళేశ్వరానికి బయల్దేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. ఇటీవల వర్షాలకు కాళేశ్వరంలోని పంప్‌హౌ్‌సల్లోకి నీళ్లు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు పంప్‌ హౌస్‌లను, ముంపు ప్రాంతాలను పరిశీలించాలని నిర్ణయించారు. బుధవారం భద్రాద్రి జిల్లా ఇల్లెందు నుంచి బయల్దేరి ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించాల్సి ఉండ గా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వాళ్లు భూపాలపల్లి వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ నేతలు జిల్లా కేంద్రానికి చేరుకొనేలోపే అక్కడ భారీగా పోలీసు లు మోహరించారు. పోలీసులు, కాంగ్రెస్‌ నేతలకు మ ఽధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 144 సెక్షన్‌ అమల్లో ఉందని, పంప్‌హౌస్‌ దగ్గరికి ఎవరికీ అనుమతి లేదని పోలీసు లు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు మంజూరునగర్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. సు మారు గంటపాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

తర్వాత పోలీసులు.. భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేసి ఘణపురం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అక్కడ భట్టి మాట్లాడుతూ కాళేశ్వరంలో అ వినీతి బయటపడుతుందన్న భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు కట్టేప్పుడు బస్సుల్లో తీసుకెళ్లి చూపించిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందు కు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.  రూ.లక్షల కోట్ల తో  నిర్మిస్తున్న ప్రాజెక్టులో లోపాలు, అవీనీతి అక్రమా లు లేకుంటే తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శన కోసం సీఎల్పీ సమావేశం లో తీర్మానం చేసి అనుమతి కోసం అధికారులకు ప్రతిపాదన పంపామని, అయినా కనీసం ఏ ఒక్క అధికారి కూడా తమకు ప్రాజెక్టులపై సరైన నివేదికలు అందించలేదన్నారు. ఎవరెన్ని అడ్డంకు లు సృష్టించినా ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రతిపక్షపార్టీగా ప్రాజెక్టులను సందర్శించి తీరుతామని స్పష్టం చేశారు.   సీఎల్పీ బృందం భద్రాచ లం ఏజెన్సీలో పర్యటనకు వస్తే కనీసం ఎమ్మెల్యేలు, మాజీమంత్రులన్న స్పృహ లేకుండా జిల్లా పోలీసులు వ్యవహరించారని, తమకు ఎలాంటి రక్షణ లేకుండా అడవుల వెం ట తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం సందర్శనపై పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని, అయినా అడ్డుకోవడం ఏమి టి? అని శ్రీధర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ కిసాన్‌ విభాగం అధ్యక్షడు అన్వే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.  

అరెస్టులు పిరికిపంద చర్య: రేవంత్‌ 
ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భట్టి విక్రమార్క, జీవన్‌ రెడ్డి, సీతక్క, శ్రీధర్‌ బాబు, పొదెం వీరయ్యలను అరెస్ట్‌ చేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పిరికిపందలా వ్యవహరించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ చర్యను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో చెప్పారు. ప్రాజెక్టులో ఎలాంటి నష్టం జరగకుంటే దాన్ని చూపించడానికి కే సీఆర్‌ ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. వా స్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ బృందం పర్యటనకు ప్రభుత్వం అడ్డు పడుతోందని విమర్శించారు. గోదావరి వరద ముంపు ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సందర్శించేందుకు ప్రభుత్వ మే దగ్గర ఉండి ఏర్పాటు చేసి చూపించాలని లేని పక్షంలో పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరంతోపాటు టీఆర్‌ఎస్‌ అవినీ తి కారణంగా నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క. నేతృత్వంలో బయలుదేరిన బృందాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్ర శ్నించారు. డిజైన్‌ లోపం అన్నారం పంప్‌హౌ్‌సకు శా పంగా మారిందని.. ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లిందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-18T07:39:13+05:30 IST