Abn logo
Jul 30 2021 @ 23:11PM

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు

హల్దీవాగు వద్ద ఆందోళన చేపడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

కొల్చారం, జూలై 30: మండలంలోని హల్దీవాగు నుంచి మూడు రోజులుగా   ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ టీపీసీసీ కార్యదర్శి రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ.. హల్దీవాగు నుంచి డబుల్‌బెడ్రూమ్‌ పేరిట మేడ్చల్‌, హైదరాబాద్‌ తదితర పట్టణాలకు పెద్దఎత్తున ఇసుక తరలించడంపై వారు ఖండించారు. అంతేగాకుండా ఈ సమాచారాన్ని అందించిన గ్రామస్థులనే పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాలో జిల్లా అధికారులు, ఫారెస్టు అధికారులతో పాటు టీఆర్‌ఎస్‌ అవినీతి కూడా ఉందని, అందువల్లే పెద్దఎత్తున ఈ దందా సాగుతున్నదని విమర్శించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేషంగౌడ్‌, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, వీరేష్‌, అశోక్‌ పాల్గొన్నారు.