- గవర్నర్ను కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు
Vijayawada: గవర్నర్ను ఎపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్, ఆ పార్టీ నాయకులు నరహరి శెట్టి నరసింహారావు, రాజీవ్ రతన్, ఎపీసీసీ సెక్రటరీ రవికాంత్, కిరణ్ కలిశారు. అమలాపురంలో జరిగిన విధ్వంసం, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల దగ్ధంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జంగా గౌతమ్ కోరారు. అమలాపురం ఘటన రాజకీయ కోణంలో జరిగిందని ఆరోపించారు. ఘర్షణలను అదుపు చేయడంలో పోలీసులు అన్ని విధాల వైఫల్యం చెందారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు సరిగా విచారించలేదన్నారు.
ఇవి కూడా చదవండి