Abn logo
Jul 12 2020 @ 17:08PM

హిమాచల్ ప్రదేశ్ సీఎం విందుకి కాంగ్రెస్ నేతలు, నెటిజెన్ల విమర్శలు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఏర్పాటు చేసిన విందుకి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. వీరభద్ర సింగ్ స్వగృహంలో నిర్వహించిన ఈ విందులో రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ కుల్దీప్ సింగ్ రాతోఢ్, ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నహోత్రి సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రసింగ్ విందుకు హాజరైన వారి మధ్యలో స్టెప్పులేసి అదరగొట్టారు.


అయితే ముఖ్యమంత్రి ఇచ్చే విందులో ఇతర పార్టీ నేతలు పాల్గొనడం సాధారణమే అయినప్పటికీ రాజస్తాన్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ విందు ప్రాధ్యాన్యత సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ నేతలు వలసలు కడుతుండడం, దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు పెద్ద రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం తెలిసిందే. ప్రస్తుతం రాజస్తాన్‌లో ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలతో విందులో పాల్గొనడం పట్ల కాంగ్రెస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement