Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 26 2021 @ 18:38PM

ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు: వీహెచ్‌

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సామాన్య ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. రైతు చట్టాల విషయంలో బీజేపీ మూర్ఖంగా వ్యవహరించిందన్నారు. మోడీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. సామాన్యులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచారన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే నూతన వ్యవసాయ చట్టాలను మోడీ తీసుకువచ్చారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని వీహెచ్‌ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement