కాటన్ దొర జనహితుడు, అపర భగీరథుడు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-05-15T18:45:47+05:30 IST

నేడు సర్ ఆర్ధర్ కాటన్ 218వ జయంతి అని... కాటన్ దొర జనహితుడు, అపర భగీరథుడు అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి కొనియాడారు.

కాటన్ దొర జనహితుడు, అపర భగీరథుడు: తులసిరెడ్డి

విజయవాడ: నేడు సర్ ఆర్ధర్ కాటన్ 218వ జయంతి అని... కాటన్ దొర జనహితుడు, అపర భగీరథుడు అని  ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి కొనియాడారు. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట, కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్ట, కావేరి నదిపై ఆనకట్ట కాటన్ దొర నిర్మించినవే అని చెప్పుకొచ్చారు. కర్నూలు-కడప కాలువను నిర్మించి తుంగభద్ర-పెన్నా నదుల అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆంగ్లేయ అధికారి అయినప్పటికీ సమాజసేవయే పరమావధిగా భావించి భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు. కాటన్ దొర స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యతనిచ్చాయన్నారు. తర్వాత వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. కాటన్ దొర స్ఫూర్తితో వైసీపీ సర్కార్ పోలవరంతో సహా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-15T18:45:47+05:30 IST