జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం: Tulasireddy

ABN , First Publish Date - 2022-01-16T18:40:15+05:30 IST

రైతుల పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల ముఖాల్లో సంతోషం లేకుండా జగన్ ప్రభుత్వం చేసిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం: Tulasireddy

అమరావతి: రైతుల పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల ముఖాల్లో సంతోషం లేకుండా  జగన్ ప్రభుత్వం చేసిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. రైతు భరోసా పథకం క్రింద ప్రతి రైతు కుటుంబానికి సర్కార్ ప్రతీ ఏడాది రూ.5 వేలు కోత పెట్టిందని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశా కేంద్రాలుగా తయారయ్యాయన్నారు. రైతు రుణమాఫీ పథకం క్రింద రూ.8 వేల కోట్లు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టికొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో దారుణంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టిందని, పావలా వడ్డీ పథకానికి పాడే కట్టిందని వ్యాఖ్యలు చేశారు. రాయితీపై వ్యవసాయ పరికరాల పథకానికి స్వస్తి పలికిందని చెప్పారు. ‘‘సబ్సిడీపై బిందు, తుంపర సేద్యానికి తిలోదకాలిచ్చింది.. పంటల భీమా ఎండమావియింది.. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు.. వ్యసాయమోటర్లకు మీటర్లు- రైతుల మెడలకు ఉరిత్రాళ్లు.. రైతుల చేతులకు సంకెళ్ళు వేసిన రైతు దుష్మన్ ప్రభుత్వం...రైతు నరేంద్ర పై చెప్పు ఎత్తి జైలుకు పంపించిన రైతు వ్యతిరేక ప్రభుత్వం... రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ది మూడో స్థానం’’ అని అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని తులసిరెడ్డి హితవుపలికారు. 

Updated Date - 2022-01-16T18:40:15+05:30 IST