Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీజేపీని ఓడించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం: Tulasi reddy

అమరావతి: నియంతృత్వ బీజేపీని ఓడించడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఏపీసీసీ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ  వాజ్ పాయ్- అద్వానీ జంట నాయకత్వంలో ఉన్న బీజేపీని 2004, 2009లో కాంగ్రెస్ ఓడించిందని గుర్తుచేశారు. మోడీ - అమీత్ షాల నాయకత్వంలో ఉన్న బీజేపీని 2024లో ఓడించడం కాంగ్రెస్‌కు అసాధ్యమేమి కాదన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీనీ మమతా బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ లాంటి వారు విమర్శించడం గర్హనీయని అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం అంటే పరోక్షంగా నియంతృత్వ బీజేపీకి సహకరించడమే అని తులసిరెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement