అమరావతి: రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ (Modi) ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ (Sunkara padmasri) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఏపీకి ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో బీజేపీ నేతలు ప్రధాని మోదీకి చెప్పాలన్నారు. విభజన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు.