రాహుల్ పబ్ వీడియోపై శైలజానాథ్ స్పందన

ABN , First Publish Date - 2022-05-03T19:49:10+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పబ్ వీడియోపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ స్పందించారు.

రాహుల్ పబ్ వీడియోపై శైలజానాథ్ స్పందన

అమరావతి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పబ్ వీడియోపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. దేశంలో బీజేపీ ఛీప్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. రాహుల్ గాంధీ ఫంక్షన్‌లకు వెల్లకూడదా అని ప్రశ్నించారు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్ళిన వీడియోను వివాదాస్పదం చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more