‘చలో రాజోలిబండ’కు బయలుదేరిన సంపత్

ABN , First Publish Date - 2021-06-24T16:43:45+05:30 IST

ఆర్డిఎస్ కుడి కాలువ పనులు ఆపాలంటూ చలో రాజోలిబండ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు.

‘చలో రాజోలిబండ’కు బయలుదేరిన సంపత్

జోగులాంబ గద్వాల: ఆర్డిఎస్ కుడి కాలువ పనులు ఆపాలంటూ  చలో రాజోలిబండ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చీకటి ఒప్పందం.. రాజకీయ ఒడంబడిక.. ఆర్థిక లావాదేవీలు ఉన్నందునే సీఎం కేసీఆర్ ఆర్డిఎస్ కుడి కాలువ పనులు ఏపీ చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్డిఎస్ రైతాంగం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను చేపడుతున్నా.. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలేదని విమర్శించారు. తాడోపేడో తేల్చుకునేందుకే చలో రాజోలిబండ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ కుడి కాలువ పనులు ఆపే దాకా ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని సంపత్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-24T16:43:45+05:30 IST