తెలంగాణ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు: Revanth

ABN , First Publish Date - 2022-05-03T14:50:18+05:30 IST

తెలంగాణ ముస్లిం సోదరులకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు: Revanth

హైదరాబాద్: తెలంగాణ ముస్లిం సోదరులకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం పూర్తయి నేడు రంజాన్ పండుగ చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణలోని ముస్లింలకు సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. హిందు ముస్లిం భాయి భాయి అనే సంప్రదాయంతో తెలంగాణలో ప్రజలు జీవిస్తారని ఇది మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సంప్రదాయ బద్ధంగా ఘనంగా జరుపుకోవాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Read more