కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ త్యాగి హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-08-13T07:09:07+05:30 IST

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజీవ్‌ త్యాగి(50) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో తన నివాసం నుంచే పాల్గొన్న ఆయన అనంతరం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయారు...

కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ త్యాగి హఠాన్మరణం

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజీవ్‌ త్యాగి(50) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో తన నివాసం నుంచే పాల్గొన్న ఆయన అనంతరం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.  


Updated Date - 2020-08-13T07:09:07+05:30 IST