SAIL మాజీ చైర్మన్ వీ కృష్ణమూర్తి మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం

ABN , First Publish Date - 2022-06-27T15:38:49+05:30 IST

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) మాజీ చైర్మన్

SAIL మాజీ చైర్మన్ వీ కృష్ణమూర్తి మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం

న్యూఢిల్లీ : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) మాజీ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ వీ కృష్ణమూర్తి మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓ ట్వీట్‌ ద్వారా సంతాపం తెలిపారు. ఆయన అసలు సిసలు జాతి నిర్మాత అని నివాళులర్పించారు. భారత దేశ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయన అత్యంత విశిష్ట వ్యక్తి అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, మారుతి ఉద్యోగ్, సెయిల్ ద్వారా ఆయన ఘన వారసత్వం సజీవంగా నిలుస్తుందన్నారు. ఆయన కుటుంబానికి ఆదివారం ప్రగాఢ సంతాపం తెలిపారు.


SAIL మాజీ చైర్మన్ వీ కృష్ణమూర్తి (Dr. V Krishna Murthy) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)కు చైర్మన్‌గా కూడా సేవలందించారు. ఆయన ఆదివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. 


డాక్టర్ వీ కృష్ణ మూర్తి మృతిపట్ల కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఓ ట్వీట్ ద్వారా సంతాపం తెలిపారు. ప్రభుత్వ రంగంలోని మేనేజర్లలో అసలు సిసలు లెజెండ్, బీహెచ్ఈఎల్‌ను నిర్మించిన వ్యక్తి, SAILను గొప్ప మలుపు తిప్పిన వ్యక్తి, మారుతిని ప్రారంభించిన వ్యక్తి ఇక లేరు అని పేర్కొన్నారు. ఆయన గ్లోరియస్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, మూడేళ్ళ ముందు సెంచరీ మిస్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఆయన అత్యంత ప్రముఖ స్థానంలో నిలుస్తారన్నారు. 


SAIL విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, వీ కృష్ణ మూర్తి 1985 నుంచి 1990 వరకు SAIL చైర్మన్‌గా సేవలందించారు. ఆయన అనేక ఇతర సంస్థలకు కూడా చైర్మన్‌గా వ్యవహరించారు. 


Updated Date - 2022-06-27T15:38:49+05:30 IST