జనగామ: రైతుల దగ్గర ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆ ధాన్యాన్ని ప్రగతిభవన్, ఫామ్‌హౌస్ ముందు పోస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో పర్యటనలో కేసీఆర్‌పై ఆయన ధ్వజమెత్తారు. ధాన్యం కొనడం చేతకాక నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీతో కలిసి కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.