Abn logo
Oct 26 2021 @ 13:50PM

కేసీఆర్ నువ్వొక మూర్ఖుడివి: Ponnala

హైదరాబాద్: ప్లీనరీలో కేసీఆర్‌ ఏదో పొడిచినట్టు గొప్పగా మాట్లాడారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన పరిశ్రమలు ఎన్ని? పెరిగిన ఎగుమతులు ఎన్ని? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన పరిశ్రమలు వ్యాపార విస్తరణలో భాగంగా ఎక్స్‌పోర్ట్స్ పెరిగాయని...అది తమ అకౌంట్‌లో ఎలా వేసుకుంటారని నిలదీశారు. ‘‘కేసీఆర్ నువ్వొక మూర్ఖుడివి’’ అని మండిపడ్డారు. ఎదుటివారి సలహాలు సూచనలు కూడా తీసుకోలేరన్నారు. కాళేశ్వరం పూర్తైతే అదనంగా ఒక్క ఎకరనికైనా నీరిచ్చారా?  అని అడిగారు. కేసీఆర్ చెప్పినవన్ని దొంగ లెక్కలు, మాయ మాటలని విమర్శించారు. హుజురాబాద్‌లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈడీ వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమెజాన్, గూగుల్ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినవే అని పొన్నాల చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...