Advertisement
Advertisement
Abn logo
Advertisement

100 మీద మోదీకి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది: Ponnala

హైదరాబాద్: దేశం మైలురాయి దాటిందని చెప్పిన మోదీ ఒక్కరోజుతో సాధించింది కాదని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మోదీ వచ్చిన తర్వాతనే దేశం గర్వించే స్థాయికి ఎదగలేదని తెలిపారు. 106 దేశాలు వందకు వంద శాతం టీకాలు ఇచ్చాయని... భారత్‌లో కేవలం వందకు 72 మందికి మాత్రమే టీకా ఇచ్చిందని పేర్కొన్నారు. టీకాలో మన దేశం 132 దేశాల తర్వాత ఉందని చెప్పారు. 100 మీద మోదీకి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుందన్నారు. 2014 ముందు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తా అన్నారని.. ఇన్ని రోజులైనా అది చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దని పొన్నాల లక్ష్మయ్య హితవుపలికారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement