Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి కొప్పులపై ఫిర్యాదు: నిరంజన్

హైదరాబాద్‌: మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై సీఈవో‌కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. అధికారులు విచారణకు ఆదేశించారన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పూర్వ కరీంనగర్ జిల్లాలో మంత్రి కొప్పుల  బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్లకు రూ.50 వేలకు పైగా ఇస్తానని చెప్పారన్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా బెదిరింపులు, డబ్బులు ఇస్తానంటున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణను సీబీఐ ద్వారా జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లంచాన్ని ఇవ్వజూపిన మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. 


Advertisement
Advertisement