రైతులకు సీఎం జగన్ ఏం మేలు చేశారు? : నరహరిశెట్టి

ABN , First Publish Date - 2020-07-09T21:15:00+05:30 IST

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు ఏం మేలు చేశారు’

రైతులకు సీఎం జగన్ ఏం మేలు చేశారు? : నరహరిశెట్టి

విజయవాడ : ‘దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు ఏం మేలు చేశారు’ అని కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహరావు ప్రశ్నించారు. గురువారం నాడు విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైఎస్ చనిపోయేదాక కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, పార్టీ సిద్దాంతాలకు లోబడి రాష్ట్ర సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. 2004 నుంచి 2014 వరకు ఏపీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ది, సంక్షేమం  ప్రజలకు ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చారు.


రంగులు మార్చి..

వైఎస్ పాదయాత్రలో చేసిన హామీల అమలులో మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంట్‌దే. విద్య, ఆరోగ్య వ్యవస్థలు సమాజాభివృద్దికి నిదర్శనం. ఫీజు రియంబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఈ రెండు వ్యవస్థలు అభివృద్ది జరిగాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలనే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రంగులు మార్చి అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూడా సామాజికంగా అభివృద్ది జరిగేలా సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం లోన్లను కూడా రద్దు చేసింది. ఇకనైనా జగన్ ప్రభుత్వం ప్రజా ప్రయోజన నిర్ణయాలతో పాలన చేయాలి అని నరహరిశెట్టి హితవు పలికారు.

Updated Date - 2020-07-09T21:15:00+05:30 IST