ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్ఎస్‌కు లేదు: Nagam

ABN , First Publish Date - 2022-05-28T17:03:38+05:30 IST

ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్ఎస్‌కు లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జానర్ధన్ రెడ్డి అన్నారు.

ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్ఎస్‌కు లేదు: Nagam

హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చే అర్హత టీఆర్ఎస్‌(TRS)కు లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జానార్ధన్ రెడ్డి(Nagam janardhan reddy) అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నాగం నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ సరిగా చేయకుంటే ఖాకీ బట్టలు వేసుకుని ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ ప్రతి నిర్ణయ కోణం రాజకీయం కోసం ఉంటోందని తెలిపారు. ఎన్టీఆర్‌కు ఉన్న లక్షణాల్లో కేసీఆర్‌కు ఒక్కటీ లేదని ఆయన విమర్శించారు. ఎనిదేళ్ళుగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మంత్రులు, ఎమ్మెలను ఎన్టీఆర్ ఘాట్‌కు పంపించారన్నారు. ఎన్నికల్లో చెప్పి‌న ప్రతి మాటను అమలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. నేటి తరం నాయకులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం తన వంతు కృషి చేస్తానని నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-28T17:03:38+05:30 IST