‘ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ప్రశ్నించేతత్వంరావాలి’

ABN , First Publish Date - 2021-06-16T17:48:33+05:30 IST

ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి అంటే ప్రశ్నించే తత్వంరావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు.

‘ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ప్రశ్నించేతత్వంరావాలి’

గుంటూరు: ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి అంటే ప్రశ్నించే తత్వంరావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. ప్రశ్నించేతత్వం లేకపోతే మోదీ, జగన్ లాంటి వాళ్ళు పెచ్చురిల్లిపోతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని పట్టించుకోకుండా గాలికి వదిలేశాయని మండిపడ్డారు. యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాహూల్ 51వ జన్మదినం సందర్భంగా ఆన్‌లైన్‌లో 25 జిల్లాల నుండి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, మాస్క్ పంపిణీ, రక్తదానం వరుసగా ఐదురోజులు జరుగుతాయని మస్తాన్ వలీ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-16T17:48:33+05:30 IST