కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడతాం: manikkam

ABN , First Publish Date - 2021-11-02T17:24:46+05:30 IST

2023 ఎన్నికల కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమీక్షలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ అన్నారు.

కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడతాం: manikkam

నిజామాబాద్: 2023 ఎన్నికల కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమీక్షలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ అన్నారు. ఇన్సూరెన్స్ కల్పిస్తూ డిసెంబర్ 9 నుంచి సభ్యత్వ నమోదు చేపడతామని తెలిపారు. బూత్ స్థాయిలో సంస్థాగతంగా పార్టీని పతిష్టపరుస్తామన్నారు. యాసంగిలోనూ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లను నిలిపివేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో రైతులు చెరుకు పంట మానేశారన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడతామని స్పష్టం చేశారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ రైతులను చీట్ చేశారని మాణికం ఠాకూర్ విమర్శించారు. 

Updated Date - 2021-11-02T17:24:46+05:30 IST