ఒకరు అమ్ముతారు.. మరొకరు కొంటారు: మల్లికార్జున ఖర్గే

ABN , First Publish Date - 2021-09-18T03:06:10+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే

ఒకరు అమ్ముతారు.. మరొకరు కొంటారు:  మల్లికార్జున ఖర్గే

గజ్వేల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆధ్యర్యంలో సీఎం ఇలాకా గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్, ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన పునరుద్ఘాటించారు. దేశంలో దళితులు, గిరిజనులు, బహుజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.


మోదీ కేవలం అదాని, అంబానీ వెంట పడ్డారన్నారు. ఒకరు అమ్ముతారు.. మరొకరు కొంటారని ఆయన పేర్కొన్నారు. వీళ్ల పాలనలో ధనవంతులు మరింత ధనవంతులుగా, బీదలు మరింత బీదలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో, దేశంలోనూ చీకటి నెలకొని ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. కేసీఆర్, మోదీలకు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి దారి చూపాలని ఖర్గే పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-18T03:06:10+05:30 IST