ఇంటి వద్దే దీక్షకు దిగిన కాంగ్రెస్ నేత Maheshwar reddy

ABN , First Publish Date - 2022-05-27T18:03:04+05:30 IST

మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేత మహేశ్వరెడ్డి దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయన గృహనిర్బంధం చేశారు.

ఇంటి వద్దే దీక్షకు దిగిన కాంగ్రెస్ నేత Maheshwar reddy

నిర్మల్: మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేత మహేశ్వరెడ్డి దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయన గృహనిర్బంధం చేశారు. దీంతో ఇంటి వద్దే కాంగ్రెస్ నేత దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ ఉద్యోగాలను టీఆర్ఎస్ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. తాను దీక్ష చేస్తానని అంటే అనుమతి ఇవ్వడం లేదని, జరిగిన తప్పుకు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా చేస్తారో... లేక మున్సిపల్ చైర్మన్‌తో రాజీనామా చేయిస్తారో తేల్చుకోవాలన్నారు. ఇలాంటి జిల్లా కలెక్టర్‌ను ఎక్కడా చూడలేదని అన్నారు. అంగట్లో సరకులా ఉద్యోగాలను అమ్ముకుంటున్నా పట్టుంచుకోకపోవడం దారుణమని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-05-27T18:03:04+05:30 IST