హైదరాబాద్: పాల్వంచలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ ఘటన మరువక ముందే నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం అప్పులతో విజయవాడలో ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ అన్నారు. దీనికి కారణం ఆ నలుగురు వడ్డి వ్యాపారులేనని ఆయన పేర్కొన్నారు. వడ్డి వ్యాపారులకు బీజేపీ ఎంపీ అరవింద్, టీఆర్ఎస్ నేత అండదండలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు కుటుంబాన్ని పరామర్శించకుండా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా పాతరపెడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశ పడవద్దని ఆయన హితవు పలికారు. 317 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి