పోలీసులున్నది గాడిదలు కాయడానికా: komati reddy

ABN , First Publish Date - 2021-09-15T17:41:15+05:30 IST

రాష్ట్రంలో ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

పోలీసులున్నది గాడిదలు కాయడానికా: komati reddy

హైదరాబాద్: రాష్ట్రంలో ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆరేళ్ళ పసికందును ఒక రాక్షసుడు రేప్ చేసి హత్య చేయడం దారుణమన్నారు. తెలంగాణ పరువు పోయిందని వ్యాఖ్యానించారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కేసీఆర్, దత్తత తీసుకున్న కేటీఆర్, డమ్మీ హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతున్ని పట్టిస్తే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్న కోమటిరెడ్డి పోలీసులున్నది గాడిదలు కాయడానికా అని విరుచుకుపడ్డారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణమన్నారు. తల్లి ఫిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసి ఉంటే అమ్మాయి బ్రతికి ఉండేదని అన్నారు.


కేటీఆర్ ప్రచారాల మంత్రి, మూర్కుడని ఆయన విమర్శించారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంతా తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మానవత్వం ఉంటె కేటీఆర్ ఇక్కడికి రావాలన్నారు. దళిత గిరిజన బిడ్డలని రాలేదా కేటీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ ఘటనలో వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని.. డబ్బులతో అవార్డులు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. దోషులను పట్టుకోకపోవడం పోలీస్ వ్యవస్థ చేతకానితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అమ్మాయి చనిపోయి బాధలో ఉంటె డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు.  చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటలా ఇవి అని అన్నారు. సినీ యాక్టర్‌ని పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకురారని, అయన అసలు మంత్రేనా అని ప్రశ్నించారు. దిశ టైంలో చేసినట్లే చిన్నారి విషయంలో కూడా వెంటనే శిక్షించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-15T17:41:15+05:30 IST