పంటలను కొనాలసిందే: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2021-11-12T23:19:17+05:30 IST

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వ కొనాలిసిదేనని కిసాన్ కాంగ్రెస్

పంటలను కొనాలసిందే: కోదండరెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం కొనాలిసిందేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటై 56 సంవత్సరాల అయిందన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ దేశంలో ఆహారభద్రతా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో ఆహార కొరత వచ్చినపుడు ఫుడ్ కార్పొరేషన్ ఉండేదన్నారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 9 వేలు ఇస్తుందన్నారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ చెప్పాడన్నారు. కానీ నేడు అదానీ, అంబానీ చేతుల్లోకి వ్యవసాయాన్ని మోడీ నెట్టేశాడని ఆయన ఆరోపించారు.




చిన్న మోడీ అయిన సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదన్నారు. చివరి గింజవరకు కొంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రోడ్లు ఎక్కుతున్నారన్నారు. దేశంలో 23 పంటలకు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అందుబాటులో ఉందన్నారు. నష్టం, లాభం గురించి ఆలోచించకుండా పంటను కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఫుడ్ కార్పొరేషన్, మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఉన్నంతకాలం పంటల్ని కొనాలసిందేనన్నారు. 

Updated Date - 2021-11-12T23:19:17+05:30 IST