వారివి రైతు వ్యతిరేక విధానాలు: కోదండరెడ్డి

ABN , First Publish Date - 2022-01-29T23:00:28+05:30 IST

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని

వారివి రైతు వ్యతిరేక విధానాలు: కోదండరెడ్డి

హైదరాబాద్: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గన్‌పార్క్ స్థూపం వద్ద కాంగ్రెస్ ఆధ్యర్యంలో చేపట్టిన మౌన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఒక వ్యవసాయం రంగం మాత్రమే పని చేసిందన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టపోయిన రైతులు మంత్రుల కాళ్ళు పట్టుకున్నారని, అయిన ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అప్పులు మాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు చేయలేదన్నారు. పండించిన పంటను రెండు నెలల వరకు కొనలేదన్నారు. నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దనే గన్‌పార్క్ స్థూపం వద్ద మౌన దీక్ష చేపట్టామని ఆయన తెలిపారు. రైతాంగానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-29T23:00:28+05:30 IST