గవర్నర్‌కు రైతు సమస్యలను విన్నవించాం: కోదండ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-01T23:07:43+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో రైతు సమస్యలను గవర్నర్‌కు విన్నవించామని

గవర్నర్‌కు రైతు సమస్యలను విన్నవించాం: కోదండ రెడ్డి

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో రైతు సమస్యలను గవర్నర్‌కు విన్నవించామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం భేటీ అయింది. ధాన్యం సేకరణ, రైతు సమస్యలపై బృందం వినతిపత్రం అందజేసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ ఆధ్యర్యంలో నిరసనలతో, దీక్షలతో ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. అయినా ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలవాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఇప్పటికే 70% ధాన్యం మిల్లర్లకు వెళ్ళిపోయాయన్నారు. పదమూడు, పద్నాలుగు వందల రూపాయలకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారన్నారు.


తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా గతంలో కాంగ్రెస్ కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టం జరగకుండా మినిమం సపోర్ట్ ధరలతో కొన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వి.హనుమంతరావు,  చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎల్పీ నేత షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-12-01T23:07:43+05:30 IST