Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల డ్రామాలు ఎండగడుతాం: దాసోజు

twitter-iconwatsapp-iconfb-icon

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు అనుసరిస్తున్న డ్రామాలను ఎండగడుతామని ఏఐసీసీ జాతీయ అధికార దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి గింజ కొనే వరకు రైతులకు కాంగ్రెస్ తరపున అండగా ఉంటామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ నీతి నిజాయితీతో ట్వీట్ చేస్తున్నారన్నారు. అమెరికాలో చదువుకున్నారన్నారు. రాహుల్ గాంధీని విమర్శించడానికి ఎమ్మెల్సీ కవితకు ఇంగిత జ్ఞానం ఉందా అని ఆయన నిలదీశారు. మీరు పార్లమెంట్‌లో ఆడుతున్న డ్రామాలకు రాహుల్ అండగా నిలబడలా అని టీఆర్‌ఎస్ ఎంపీలను ఆయన ప్రశ్నించారు. కల్లాలకు తిరుగుతూ రైతులకు అండగా నిలబడాల్సింది ఢిల్లీ వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రైతులకు ఆత్మహత్యలపై చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్‌లో రాహుల్ గాంధీ రెండు రోజులు పాదయాత్ర చేపట్టారని ఆయన పేర్కొన్నారు. రైతుల పక్షాన నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌తో సహా అందరూ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.