న్యూఢిల్లీ/హైదరాబాద్: రాబోయే కొద్దిరోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క (Batti vikramarka) అన్నారు. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ (Venugopal)తో భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) భేటీ అయ్యారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని తెలిపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని.. అంతా సర్దుమణిగిందని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీ దోస్తీ బయటపడిందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించామని తెలిపారు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదని భట్టి విక్రమార్క అన్నారు.
ఇవి కూడా చదవండి