ప్రభుత్వాన్ని, పార్టీని వేరుగా చూడాలి: కాంగ్రెస్ నేత అంబటి

ABN , First Publish Date - 2020-05-23T15:24:31+05:30 IST

ప్రభుత్వాన్ని, పార్టీని వేరుగా చూడాలి: కాంగ్రెస్ నేత అంబటి

ప్రభుత్వాన్ని, పార్టీని వేరుగా చూడాలి: కాంగ్రెస్ నేత అంబటి

అమరావతి: ప్రజలకు సంబంధించిన ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదని...ప్రభుత్వాన్ని, పార్టీని వేర్వేరుగా చూడాలని కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రామకృష్ణ అన్నారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ  55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ఆలోచన చేయలేదని...అలా చేసి ఉంటే దేశంలో ఏరంగు కనిపించేది కాదని...ఒక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులే కనిపించేవని ఆయన తెలిపారు. ఇలాంటి ధోరణిని ప్రభుత్వం విడనాడాలని సూచించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. మాస్కులు లేవని ప్రశ్నించినందుకే ఆయనను దూషించారని ఆరోపించారు. సుధాకర్ తప్పు చేసి ఉంటే సమర్థించాలని తాము కోరుకోవడం లేదని...ఆయన విషయంలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు. వృత్తి పరంగా, కులం పరంగా డాక్టర్ సుధాకర్‌కు అన్యాయం జరిగిందని అంబటి రామకృష్ణ విమర్శించారు. 

Updated Date - 2020-05-23T15:24:31+05:30 IST