పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు
తుని, జనవరి 26: స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థులను పోటీకి నిలుపుతామని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు తెలిపారు. మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు ఇంకా గుర్తించుకున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేయాలని, అధికార పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.