‘బీజేపీని బలోపేతం చేసే పనుల్లో KCR’

ABN , First Publish Date - 2022-06-11T19:21:32+05:30 IST

బీజేపీని బలోపేతం చేసే పనిలలో కేసీఆర్ పడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

‘బీజేపీని బలోపేతం చేసే పనుల్లో KCR’

హైదరాబాద్: బీజేపీని బలోపేతం చేసే పనిలలో కేసీఆర్(KCR) పడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతుందన్నారు. కేసీఆర్‌కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఎటూ కాకుండా పోతారని తెలిపారు. కాంగ్రెస్‌ 200 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఉన్న 8 ఎంపీ సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్‌ లేకుండా దేశంలో ప్రత్యామ్నాయం సాధ్యం కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-11T19:21:32+05:30 IST