స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నడవాలి: జెట్టి గురునాధరావు

ABN , First Publish Date - 2022-08-10T00:19:21+05:30 IST

75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ (Congress) ఆధ్వర్యంలో జెట్టి గురునాధరావు నాయకత్వంలో...

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నడవాలి: జెట్టి గురునాధరావు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ (Congress) ఆధ్వర్యంలో జెట్టి గురునాధరావు  నాయకత్వంలో ఏలూరు జిల్లా పరిధిలో 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం గౌరవరం గ్రామం నుంచి కోయిలగూడెం మీదగా రేపల్లెవాడ వరకు "స్వతంత్రోద్యమ స్ఫూర్తితో గౌరవ యాత్ర" చేపట్టారు. గవరవరం గ్రామం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  ఈ సందర్బంగా బుట్టాయిగూడెం మండలం నందాపురానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు,గిరిజన గాంధీగా పిలవబడే స్వామి సత్యానందను సన్మానించారు. 


ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో దేశ ప్రజలు ముందుకు నడవాల్సిన రోజులు వచ్చాయన్నారు. దేశంలో నేటి ప్రభుత్వ పాలన బ్రిటిష్ వారిని తలపించే విధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు పరం అవుతున్నాయని.. దేశ సంపదను కార్పొరేట్ యాజమాన్యానికి సమర్పిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని.. యువతరం మరో స్వాతంత్ర పోరాట ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


AICC, పీసీసీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని.. సహకరించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అందరికి జెట్ట గురునాధరావు అభినందనలు తెలియజేశారు. 


ఈ పాదయాత్రలో ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కమ్ములు కృష్ణ, పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పైడి ముక్కల మురళీకృష్ణ , కొయ్యలగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జుంగా జవహర్లాల్ నెహ్రూ (బాబ్జి), పట్టణ అధ్యక్షుడు నక్కా బాబి, బీసీ సెల్ దారం సత్తిరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కోనపాము అబ్బులు, పాండు, పోలవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతు వేణు, బుట్టాయిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దిపాటి శ్రీను, బుర్ర నాగు, వేలేరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరు సత్యనారాయణ, జీలుగుమిల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాల సీతారామయ్య, చింతలపూడి నియోజకవర్గ నాయకులు మద్దాల ప్రసాద్ , ముప్పిడి శ్రీనివాస్, షేక్ హీరా హకీమ్, చాబ తులు వెంకటరత్నం, గౌతు సత్యేంద్ర, ఉప్పే రాజకుమార్, నులకని నాగబాబు, మద్ది పట్ల శ్రీను రొక్కం ఆదినారాయణ, ప్రగళ్ళ పాటి కాశి,  మొగిలినీడి శ్యామ్, మహమ్మద్ జమీర్, దున్న శివ, జ్ఞాని, దిరుసు పాము సోమరాజు, మండవల్లి రాంబాబు, మనకే నాగేశ్వరరావు, వసంతటి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T00:19:21+05:30 IST