high command warned: లక్ష్మణ రేఖ దాటొద్దు

ABN , First Publish Date - 2022-07-27T18:27:01+05:30 IST

సమష్టి నాయకత్వంలోనే 2023 శాసనసభ ఎన్నికల్లో ముందుకు సాగాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి(Chief Minister's post) విషయంలో

high command warned: లక్ష్మణ రేఖ దాటొద్దు

బెంగళూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సమష్టి నాయకత్వంలోనే 2023 శాసనసభ ఎన్నికల్లో ముందుకు సాగాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి(Chief Minister's post) విషయంలో వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్‌ హైకమాండ్‌ హెచ్చరించింది. సిద్దరామయ్య(Siddaramaiah) మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజల ఆకాంక్షగా ఉందని ఆయన అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందంటూ బెంగళూరు చామరాజపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే(Congress MLA) జమీర్‌ అహ్మద్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా నేరుగా ఆయనకు లేఖ రాశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే ఇలాంటి వ్యాఖ్యలు ఇకముందు చేయవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇకపై ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఈ లేఖలో సుర్జేవాలా సూచించారు. జమీర్‌ ఖాన్‌(Zameer Khan)కు మూగుతాడు వేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో సహా పలువురు సీనియర్లు అధిష్ఠానం పెద్దలకు సూచించిన నేపథ్యంలోనే ఈ హెచ్చరిక సందేశం వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - 2022-07-27T18:27:01+05:30 IST