అప్పటి వరకు సోనియానే పార్టీ అధినేత్రి: కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-08-10T01:28:07+05:30 IST

కాగా ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎలెక్ట్ కమిటీ స్పందించింది. పార్టీకి అధ్యక్షుల నియామకంలో మరీ పొడగింపు ఏమీ ఉండదని, అయితే పార్టీలో..

అప్పటి వరకు సోనియానే పార్టీ అధినేత్రి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష స్థానంపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఏదో సందర్భంలో పార్టీలో పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు తమ గొంతును పెంచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.


కాగా ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎలెక్ట్ కమిటీ స్పందించింది. పార్టీకి అధ్యక్షుల నియామకంలో మరీ పొడగింపు ఏమీ ఉండదని, అయితే పార్టీలో సరైన విధానం అమలు అయినప్పుడు ఎన్నిక జరుగుతుందని ప్రకటించింది. అప్పటి వరకు సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ ఎలెక్ట్ పార్టీ ఛీఫ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-10T01:28:07+05:30 IST