టీడీపీ, వైసీపీలు నోరుతెరవడం లేదేం

ABN , First Publish Date - 2021-01-27T05:34:19+05:30 IST

ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా మదనపల్లెలో కాంగ్రెస్‌, వామపక్షాలు, ప్రజాసంఘాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు

టీడీపీ, వైసీపీలు నోరుతెరవడం లేదేం
మదనపల్లె వన్‌టౌన్‌ స్టేషన్‌ వద్ద షాజహాన్‌ బాషా తదితరుల ఆందోళన

మదనపల్లెలో ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతు 


మదనపల్లె రూరల్‌, జనవరి 26: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని కోరుతూ మంగళవారం మదనపల్లెలో కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పాజహాన్‌ బాషా, సీపీఎం నేత శ్రీనివాసులు, సీపీఐ నేత కృష్ణప్ప, బాస్‌ నేత పీటీఎం శివప్రసాద్‌ తదితరుల ఆధ్వర్యంలో స్థానిక టిప్పుసుల్తాన్‌ కాంప్లెక్స్‌ నుంచి ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్దకు రాగానే సీఐలు ఈదురుబాషా, నరసింహులు తదితరులు సిబ్బందితో కలసి అడ్డుకున్నారు. దీంతో మూడురోజుల కిందటే ర్యాలీకి అనుమతినివ్వాలని డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చామని నాయకులు పేర్కొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వ్యతిరేకించడంతో నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఆందోళనకారులను వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అక్కడా స్టేషన్‌ ఎదుట నాయకులు బైఠాయించి ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడుతూ ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా చేపట్టిన ర్యాలీని వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు మద్దతుగా పోరాడాల్సిన వైసీపీ, టీడీపీలు నోరుతెరవడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో పలుసంఘాలు, పార్టీల నాయకులు కృష్ణప్ప, నాగూర్‌వలి, సురేందర్‌రెడ్డి, వేమయ్య, శంకర్‌ నాయుడు, కృష్ణప్ప, జయన్న, ఇంతియాజ్‌, ఇనాయత్‌, సాంబ, ముబారక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:34:19+05:30 IST