ధర్మపురిలో కాంగ్రెస్‌ సంబరాలు

ABN , First Publish Date - 2022-08-19T06:31:04+05:30 IST

సుప్రీం కోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్‌ డిస్మిస్‌ కావ టంతో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరు పుకున్నారు.

ధర్మపురిలో కాంగ్రెస్‌ సంబరాలు
ధర్మపురిలో టపాకాయలు పేలుస్తున్న కాంగ్రెస్‌ నేతలు

 సుప్రీం కోర్టులో మంత్రి పిటిషన్‌ డిస్మిస్‌ 

ధర్మపురిలో కాంగ్రెస్‌ సంబరాలు

ధర్మపురి, ఆగస్టు 18: సుప్రీం కోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్‌ డిస్మిస్‌ కావ టంతో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరు పుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. స్థానిక నంది విగ్రహ చౌరస్తా వద్ద అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ జిందాబాద్‌, రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. టపాకాయలు పేల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ 2018లో ధ ర్మపురి నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలపై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హైకో ర్టును ఆశ్రయించగా  మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్‌ కొట్టివేయాలని మధ్యంతర పిటిషన్‌ దాఖ లు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి ఈశ్వర్‌ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేయడం వల్ల ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. సుప్రీం కోర్టులోనూ మంత్రి పిటి షన్‌ను డిస్మిస్‌ చేశారని తెలిపారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా తేలు తుందని, న్యాయం గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజ కవర్గ కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖల అధ్యక్షులు సంగనభట్ల దినేష్‌, సుభాష్‌, శ్రీనివాస్‌, శైలేందర్‌రెడ్డి, రాములు, మండల ఉపాధ్యక్షులు రాజేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సుధాకర్‌, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, నియోజకవర్గ యువజన కాంగ్రె స్‌ అధ్యక్షులు ప్రసాద్‌, మండల అధ్యక్షులు రాందేని మొగిలి పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-19T06:31:04+05:30 IST