రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోరాం: కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-04-09T00:18:06+05:30 IST

కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సూచించినట్టు..

రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోరాం: కాంగ్రెస్

న్యూఢిల్లీ: కోవిడ్-19 ప్రభావం రాష్ట్రాలపై ఎక్కువగా పడినందున రాష్ట్రాలకు తప్పనిసరిగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని తాము ప్రస్తావించినట్టు కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ బుధవారంనాడు మీడియాకు తెలిపారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో పరిమితమైన వనరులు మాత్రమే రాష్ట్రాల వద్ద ఉన్నట్టు తాము ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు. సమావేశంలో పాల్గొన్న సుమారు 80 శాతం రాజకీయ పార్టీలు లాక్‌డౌన్ పొడిగించాలని సూచించినట్టు కూడా ఆజాద్ తెలిపారు.


కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సూచించినట్టు ఆజాద్ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 14న ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దేశంలోని పరిస్థితి 'సామాజిక ఎమర్జెన్సీ'ని తలపిస్తోందని, అందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కూడా మోదీ అన్నిపార్టీల నేతలకు సూచించారు.

Updated Date - 2020-04-09T00:18:06+05:30 IST