‘అగ్నిపథ్‌’పై భగ్గుమన్న కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-06-28T05:42:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపఽథ్‌ పథకంపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గు మంది. వెంటనే పథకాన్ని రద్దు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు సోమవారం శాంతియుత సత్యాగ్రహం నిర్వహించారు.

‘అగ్నిపథ్‌’పై భగ్గుమన్న కాంగ్రెస్‌
ఆమదాలవలస:నిరసన తెలుపుతున్న డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి, కాంగ్రెస్‌ నాయకులు


  జిల్లావ్యాప్తంగా సత్యాగ్రహం

  పథకాన్ని వెంటనే రద్దు చేయండి  

 డీసీసీ అధ్యక్షురాలు సత్యవతి 


ఆమదాలవలస/రణస్థలం/కాశీబుగ్గ/పోలాకి/టెక్కలి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపఽథ్‌ పథకంపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గు మంది.  వెంటనే పథకాన్ని రద్దు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు సోమవారం శాంతియుత సత్యాగ్రహం నిర్వహించారు.  ఆమదాలవలసలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ పథకాన్ని  కేంద్రం  ఉపసంహరించుకోకపోతే యువత ఆగ్రహానికి గురికాకతప్పదని  హెచ్చరించారు.  కార్యక్రమంలో కాం గ్రెస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ సనపల అన్నాజీరావు, మాజీ ఎంపీపీ గోవింద గోపాల్‌, నాయకులు బొత్స రమణ, బస్వా షన్ముఖరావు, లఖినేని నారాయణరావు, పి.వెంకటరమణ, ఊస రమణ సాయిరాం పాల్గొన్నారు. కాశీబుగ్గ పాత బస్‌స్టాప్‌లోని రాజీవ్‌ గాంధీ విగ్రహం  వద్ద పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మధు, టౌన్‌ ప్రసిడెంట్‌ మాదిన వెంకటరమణ, తంగుడు వీరరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.  పోలాకి మండలం తలసముద్రం గ్రామంలో, టెక్కలి ఇందిరాగాంధీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కోత మఽధుసూధనరావు, నాయకులు చింతాడ దిలీప్‌, పొట్నూరు ఆనందరావు, సూర్యకుమారి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రణస్థలంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు కొత్తకోట్ల సింహాద్రినాయుడు, కె.లక్ష్మి, కె.జోగునాయుడు, వై.సూర్యనారాయణ, ఎ.జగదీశ్‌నాయుడు, ఎం.గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 



 

Updated Date - 2022-06-28T05:42:23+05:30 IST