అవినీతి, కాంగ్రెస్ కవలలు: బీజేపీ అధినేత నడ్డా

ABN , First Publish Date - 2022-04-18T02:05:13+05:30 IST

దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. దేశాన్ని లూటీ చేసింది. అవినీతి, కాంగ్రెస్ ఒకే నాణేనాకి రెండు వైపులు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలే వచ్చేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి అనేదే కనిపించడం లేదు. మా లక్ష్యం ప్రజా సంక్షేమం..

అవినీతి, కాంగ్రెస్ కవలలు: బీజేపీ అధినేత నడ్డా

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అవినీతి కవలలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడ ఉన్నా మిషన్ ఉంటుందని, అదే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నా కమిషన్ ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం కర్ణాటకలోని హొసపెటెలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో కేంద్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. దేశాన్ని లూటీ చేసింది. అవినీతి, కాంగ్రెస్ ఒకే నాణేనాకి రెండు వైపులు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపై ఎప్పుడూ అవినీతి ఆరోపణలే వచ్చేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి అనేదే కనిపించడం లేదు. మా లక్ష్యం ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలను తీర్చడం, దేశాన్ని అభివృద్ధివైపుకు తీసుకెళ్లడమే. కాంగ్రెస్ దేశాన్ని పూర్తిగా అవినీతిలోకి నెట్టివేస్తే మా ప్రభుత్వం తక్కువ కాలంలోనే ఆ పరిస్థితిని మెరుగు పరిచింది. అవినీతి ఉపేక్షించం కాబట్టే ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి’’ అని నడ్డా అన్నారు.

Updated Date - 2022-04-18T02:05:13+05:30 IST