చైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జీఎంఆర్ వరలక్ష్మి గ్రూప్ సిబ్బంది
శంషాబాద్, మే 17: శంషాబాద్ మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి అవార్డు వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి గ్రూపు సిబ్బంది మంగళవారం శంషాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మామహేందర్‌రెడ్డిని అభినందనలు తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం చేసినందుకు ప్రభుత్వం ఇటీవల అవార్డు ప్రకటించింది. ఈ మేరకు జీఎంఆర్ వరలక్ష్మి గ్రూపు సిబ్బంది బి.శ్రీనివాస్ రమేష్ చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.