కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

ABN , First Publish Date - 2020-11-29T04:38:28+05:30 IST

కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌కు ‘మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు లభించిన నేపథ్యంలో శనివారం వైసీపీ జిల్లా వ్యవహా రాల సమన్వయకర్త చిన్నశ్రీను కలెక్టరేట్‌లో ఆయన్ని కలిసి అభినందనలు తెలి పారు.

కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

 విజయనగరం దాసన్నపేట: 

కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌కు ‘మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు లభించిన నేపథ్యంలో శనివారం వైసీపీ జిల్లా  వ్యవహా రాల సమన్వయకర్త చిన్నశ్రీను కలెక్టరేట్‌లో ఆయన్ని కలిసి అభినందనలు తెలి పారు.  జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కలెక్టర్‌ విజయనగరం ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారని చిన్నశ్రీను కొనియాడారు. జల సంర క్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించినందుకు ఢిల్లీకి చెందిన ఇండియన్‌ ఎఛీవర్స్‌ ఫోరమ్‌ ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం గొప్పవిషయమన్నారు.   రింగు రోడ్డు :  నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని వారు కోరారు. టీపీవోల కనకారావు, శ్రీలక్ష్మి , జనర్దనరావు, సిబ్బంది రమేష్‌రాజు, వినోద్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.  కలెక్టరేట్‌:  జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకు రావాలన్న తపనతోనే పనిచేసినట్లు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.  స్కోచ్‌, జాతీయ జలశక్తి, ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డులు తన ఒక్కడివి కావని,  జిల్లా యంత్రాంగంలో పనిచేసే ప్రతి అధికారికీ లభించిన గుర్తింపుగా భావించా లని చెప్పారు. ఈ దిశగా పని చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో  జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటే కార్యక్రమాలు ఎవరు చేపట్టినా జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. 

 

Updated Date - 2020-11-29T04:38:28+05:30 IST