అఖిలను అభినందిస్తున్న తడక వెంకటేష్
భూదాన్ పోచంపల్లి, మే 26: పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ముషం స్వామి కుమార్తె అఖిల జాతీయస్థాయి పుట్‌బాల్ జట్టుకు ఎంపిక కావడంతో ఆమెకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సూరపల్లి రమేష్, తడక గౌరీశంకర్, వేముల పాండు, సురపల్లి రాం, అంకం సాయి, వేముల నరేష్, జయసూర్య సందీప్, నవీన్ పాల్గొన్నారు.