థామస్ కప్ విజయోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-18T03:45:56+05:30 IST
బ్యాంకాక్‌లో నిర్వహించిన థామస్ కప్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించడంపై జిల్లా కేంద్రంలో మంగళవారం విజయో త్సవం నిర్వహించారు. మంచిర్యాల క్లబ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మిం టన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ భారతి హోళి కేరీ హాజరై క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఏసీసీ, మే 17 : బ్యాంకాక్‌లో నిర్వహించిన థామస్ కప్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత జట్టు విజయం సాధించడంపై జిల్లా కేంద్రంలో మంగళవారం విజయో త్సవం నిర్వహించారు. మంచిర్యాల క్లబ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మిం టన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ భారతి హోళి కేరీ హాజరై క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత ప్లేయర్స్ ప్రతిభ కనబరుస్తూ చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ముకేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాక ర్, ఉపాధ్యక్షులు మీనారెడ్డి, వాసు, సత్యపాల్‌రెడ్డి, రాజలింగం పాల్గొన్నారు.