‘సంచుల’ సేకరణకు ఆపసోపాలు!

ABN , First Publish Date - 2022-05-25T09:32:37+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఇప్పు డిప్పుడే వేగవంతమవుతున్న సమయంలో గోనె సంచుల కొరతతో ఇబ్బం దులు తలెత్తుతున్నాయి.

‘సంచుల’ సేకరణకు ఆపసోపాలు!

  • ఈ సీజన్‌లో బెంగాల్‌ నుంచి ఒక్కటీ రాలె..
  • కొత్తవి కావాలంటే నెల రోజులు ఆగాల్సిందే
  • ఆలస్యంగా ఇండెంట్‌ పెట్టడంతోనే ఈ పరిస్థితి
  • పాత సంచులను సెంటర్లకు పంపుతున్న సర్కార్‌


హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఇప్పు డిప్పుడే వేగవంతమవుతున్న సమయంలో గోనె సంచుల కొరతతో ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి కొత్త గోనె సంచులు రాష్ట్రానికి రాకపోవటంతో... పాత వాటితోనే సర్దుకోవాల్సి వ స్తోంది. అవి కూడా పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది. రాష్ట్రానికి 8.70 కోట్ల కొత్త గో నె సంచులు వస్తేనే సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ రవాణాకు 54 శాతం కొత్త సంచులు, 46 శాతం పాత సంచులు వినియోగించాలని ఎఫ్‌సీఐ నిబంధనలు ఉన్నాయి. ఈ నిష్పత్తి ప్రకారం యాసంగిలో 8.70 కోట్ల కొత్త సంచులు, 7.55 కోట్ల పాత గోనె సం చులు సేకరించాల్సి ఉంది. 100 క్వింటాళ్ల వరి ధాన్యం మిల్లుకు పంపడానికి 250 గోనె సంచులు కావాలి. ఇందులో 67 శాతం లెక్కన సీఎంఆర్‌ డెలివరీ తో 134 గోనె సంచులు తిరిగి ఎఫ్‌సీఐకి వెళ్తాయి. అంటే ఒక క్వింటాల్‌ ధాన్యం తీసుకొని, 67 శాతం సీఎంఆర్‌ ఇచ్చిన తర్వాత 116 ఖాళీ సంచులు రైస్‌మిల్లర్ల వద్ద మిగులుతాయి.


ఇలా ఒక సారి వినియోగించిన గన్నీ బ్యాగులను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సేకరించి కొనుగోలు కేంద్రాలకు పంపిస్తోంది. కొత్త గోనె సంచులు వచ్చే దాకా పాత సంచులకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఇటీవల కేంద్రానికి లేఖ రాయగా.. మినహాయింపు సైతం వచ్చింది. అయితే, ఎఫ్‌సీఐ అధికారులు మళ్లీ కొర్రీలు పెడుతున్నారని, పాత గోనె సంచుల్లో సీఎంఆర్‌ డెలివరీ ఇస్తే తీసుకోవడం లేదని రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మంగళవారం నుంచి పాత గన్నీల్లో సీఎంఆర్‌ డెలివరీ తీసుకోవడానికి ఎఫ్‌సీఐ ఓకే చెప్పింది.


మరో నెల ఆగాల్సిందే

ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి మూడు నెలల ముందుగానే జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఇండెంట్‌ పెట్టడంతోపాటు అడ్వాన్స్‌ చెల్లిస్తే... అందుకు అనుగుణంగా గోనె సంచులు సరఫరా చేస్తుంది. కానీ, తెలంగాణ నుంచి 8.70 కోట్ల కొత్త గన్నీలకు ఇండెంట్‌ ఆలస్యంగా వెళ్లడం వల్లే సమస్య తీవ్ర రూపం దాల్చిందని చె బుతున్నారు. కొత్త సంచలు రావాలంటే మరో నెల ఆగాలని, ఈలోగా  ధాన్యం సేకరణ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిసింది.


నెల రోజులైనా కేటాయింపుల్లేవు

ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. రాష్ట్రంలో కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు గడిచినా... ఒక్క కొత్త గోనె సంచినీ పంపించలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు 9.97 కోట్ల గోనె సంచులు సమకూర్చుకుంది. ఇప్పటివరకు 5.50 కోట్ల గోనె సంచులు ధాన్యం సేకరణకు వినియోగించాం. మరో నాలుగున్నర కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కడా కొరత ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. కొత్త గోనె సంచులు రాకపోయినా పాతవాటితో సర్దుబాటు చేస్తున్నాం. జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోనె సంచులు రాష్ట్రానికి పంపిస్తేనే సేకరణ సజావుగా సాగుతుంది. 

- గంగుల కమలాకర్‌, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి

Updated Date - 2022-05-25T09:32:37+05:30 IST